నిరుద్యోగుల వయోపరిమితి పదేండ్లకు పెంపు 

నిరుద్యోగుల వయోపరిమితి పదేండ్లకు పెంపు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగ నియామక నోటిఫికేషన్లతో పాటు నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ మరో తీపి కబురు అందించారు. పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనివల్ల మరింత మంది ఉద్యోగార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నదని సీఎం తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 యేళ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 యేళ్లకు, దివ్యాంగులకు 54 యేళ్లకు గరిష్ఠ వయోపరిమితి పెరుగుతుందన్నారు.

నిరుద్యోగుల వయోపరిమితి పదేండ్లకు పెంపు