ఇక ఎనుమాముల అగ్రి మార్కెట్ లో రూ.5 కే భోజనం
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ ఎనుమాముల మార్కేట్ లోని పత్తి యార్డులో రూ. 5 భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటీన్ ను టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మంగళవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ దిడ్డి భాగ్యలక్ష్మి, మార్కెటింగ్ శాఖ అధికారులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు , రైతులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు యార్డు నందు (సీటీవీఐయూ ) మిరప నాణ్యత తనిఖీ యూనిట్ ఆధ్వర్యంలో మిరప నాణ్యతను పరీక్షించారు. మార్కెట్ లోని అపరాల యార్డులో చిల్లీస్ టెస్టింగ్ యూనిట్ ను ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు.