వరంగల్ లో కేటీఆర్ పర్యటన వివరాలు
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ది, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఏప్రిల్ 20 బుధవారం రోజున వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన వివరాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ , హనుమకొండ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు అరూరి రమేష్, దాస్యం వినయ్ భాస్కర్ ప్రకటించారు. ఉదయం 9.15 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంకి హెలికాప్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ చేరుకుంటారు. అనంతరం ఉదయం 9.30.గంటలకు మహానగర పాలక సంస్థ వరంగల్ (జీడబ్ల్యూఎంసీ) కార్యాలయంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ,శంకుస్థాపనలు చేయనున్నట్లు వారు తెలిపారు.
అనంతరం ఉదయం 10.15. స్మార్ట్ రోడ్డు (ఫేజ్-1),ఆర్ 4, జీడబ్ల్యూఎంసీ ప్రాంగణం రంగంపేట్ లో ప్రారంభోత్సవం. ఉదయం.10.30.గంటలకు రంగంపేటలోని రీజనల్ లైబ్రరీ ప్రారంభోత్సవం. ఉదయం.11.00 గంటలకు ములుగు రోడ్డు కాపువాడలోని స్మార్ట్ రోడ్డు (ఫేజ్-2,) ఆర్ 3 ప్రారంభోత్సవం. ఉదయం.11.15. పబ్లిక్ గార్డెన్ లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం, ఉదయం.11.30 గంటలకి , హెలికాప్టర్ ద్వారా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి నర్సంపేట పర్యటనకు బయలుదేరుతారని తెలిపారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నర్సంపేట నుండి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారన్నారు.
మధ్యాహ్న 2. గంటలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ నివాసంలో భోజనం విరామం IDOC, హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య నివాసానికి వెళ్లి ఆయనను కేటీఆర్ పరామర్శించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత టీ బ్రేక్ ఉండనున్నట్లు తెలిపారు. అనంతరం కూడా మైదానంలో పబ్లిక్ మీటింగ్ కు హాజరవుతారన్నారు. సాయంత్రం 6 గంటలకు హనుమకొండ నుండి రోడ్డు మార్గం ద్వారా కేటీఆర్ హైదరాబాద్ కు ప్రయాణం చేయనున్నట్లు వారు వెల్లడించారు.