సినీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అరెస్ట్

సినీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అరెస్ట్

వరంగల్ టైమ్స్, హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో సినీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ హాథిరామ్ అరెస్ట్ అయ్యారు. హాథిరామ్ సినీ ఆర్టిస్టుల‌కు గంజాయి స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 190 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సినీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అరెస్ట్కాగా హాథిరామ్ తో పాటు ఆరుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌రొక‌రు ప‌రారీలో ఉన్నాడు. కురుక్షేత్రం, యుద్ధం శ‌ర‌ణం గ‌చ్చామి చిత్రాల‌కి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాడు హాథిరామ్. క‌ర్నాట‌క నుంచి కారులో గంజాయిని త‌ర‌లిస్తుండ‌గా పోలీసులు ప‌ట్టుకున్నారు.