రేపటి నుండి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం   

రేపటి నుండి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మార్చి 26 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఆన్లైన్ లో ఏప్రిల్ 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పేపర్ 1, పేపర్ 2 కు కలిపి దరఖాస్తు ఫీజును రూ. 300గా నిర్ణయించారు. ఒక పేపర్ కు దరఖాస్తు చేసుకున్న ఇదే ఫీజు వర్తించనుంది. ఆన్లైన్ లో ఫీజు కట్టేటప్పుడు అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, రాష్ట్రం, మొబైల్ నంబర్ తప్పని సరిగా నమోదు చేయాలి. ఆన్లైన్ పేమెంట్ కు చివరి తేదీ ఏప్రిల్ 11. పేమెంట్ అయిన తర్వాత జర్నల్ నంబర్ వస్తోంది. ఈ నంబర్ తో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.రేపటి నుండి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం   బీఈడీ, డీఈడీ చివరి సంవత్సరం విద్యార్థులకు కూడా అవకాశం..
ఇక బీఈడీ, డీఈడీ చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులు కూడా టెట్ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. 2017 టెట్ సిలబస్ ప్రకారమే ఈ సారి పరీక్షలు నిర్వహించనున్నారు. హెల్ప్ డెస్క్ సేవలు మార్చి 26 నుంచి జూన్ 12 వరకు అందుబాటులో ఉండనున్నాయి.

జూన్ 6 నుంచి హాల్ టికెట్లు..
జూన్ 12 న టెట్ నిర్వహించి, 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. జూన్ 6 నుంచి టెట్ హాల్ టికెట్లను సంబంధిత వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. tstet.cgg.gov.in అనే వెబ్ సైట్ లో టెట్ కు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచారు.