28 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల పరిస్థితి విషమం

28 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల పరిస్థితి విషమం

వరంగల్ టైమ్స్, రాయ్ పూర్ : ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలోని సీఆర్ పీఎఫ్ 150 బెటాలియన్ లో ఆందోళన నెలకొంది. చింతగుప్పలోని సీఆర్పీఎఫ్ 150 వ బెటాలియన్ కు చెందిన 28 మంది జవాన్లు శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడం వల్లే జవాన్లు అనారోగ్యం పాలయ్యాడు. అస్వస్థతకు గురైన జవాన్లను సీఆర్పీఎఫ్ ఫీల్డ్ ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు.28 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల పరిస్థితి విషమంజవాన్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పాల ఆవాల నూనెతో వండిన ఆహారం తినడం వల్లే జవాన్లు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన కమాంటెండ్ రాజేశ్ యాదవ్ విచారణకు ఆదేశించారు.