ఇద్దరు జవాన్ల ప్రాణాల మీదకొచ్చిన గొడవ

ఇద్దరు జవాన్ల ప్రాణాల మీదకొచ్చిన గొడవములుగు జిల్లా : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో కాల్పులు కలకలం రేపాయి. వెంకటాపురం మండలకేంద్రంలోని సీఆర్పీఎఫ్ ఏ39 బెటాలియన్ బేస్ క్యాంప్ లో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బెటాలియన్ లోని కానిస్టేబుల్ స్టీఫెన్ , ఎస్సై ఉమేష్ చంద్ర అనే జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. టిఫిన్ విషయంలో చిన్న గొడవ జరుగడంతో ఇద్దరి మధ్య కాల్పులకు దారితీసింది.

ఈ కాల్పుల్లో జవాన్ ఎస్సై ఉమేష్ చంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. కానిస్టేబుల్ స్టీఫెన్ కు తీవ్రగాయాలు కావడంతో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఎస్సై ఉమేష్ చంద్ర బీహార్ వాసిగా సమాచారం. గాయపడిన కానిస్టేబుల్ స్టీఫెన్ కన్యాకుమారి వాసిగా పోలీసు అధికారులు తెలిపారు.