తీన్మార్ మల్లన్నపై అల్లం నారాయణ ఫైర్

తీన్మార్ మల్లన్నపై అల్లం నారాయణ ఫైర్హైదరాబాద్ : తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఫైర్ అయ్యారు. తీన్మార్ మల్లన్న చేసిన పనిని అల్లం నారాయణ తీవ్రంగా ఖండించారు. చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ Q న్యూస్ లో ‘పోల్’ పేరిట రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు “బాడీ షేమింగ్”కు పాల్పడటం బాధాకరమన్నారు. యూట్యూబ్ ఛానల్ పేరిట కొందరు వాడుతున్న భాష జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమైందన్నారు.

జర్నలిస్టుల పేరిట, పత్రికా స్వేచ్ఛ పేరిట వాడుతున్న భాషను రాజకీయ విధానాల మీద కాకుండా, కుటుంబ సభ్యులను వివాదాలకు లాగుతున్న ప్రయత్నాలను తాను ఖండించారు. ఇది అసలు జర్నలిజమే కాదని నిప్పులు చెరిగారు. యూట్యూబ్ ఛానళ్ల పేరిట సోషల్ మీడియాలో చలామణి అవుతున్న చలామంది ప్రాథమికంగా జర్నలిస్టులు కాదని అల్లం నారాయణ చురకలు అంటించారు.