జనవరి 6న ఉర్దూ ఉద్యోగాల జాబ్ మేళా

జనవరి 6న ఉర్దూ ఉద్యోగాల జాబ్ మేళాహైదరాబాద్ : గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీలో జనవరి 6న ఉర్దూ జాబ్ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ, సెట్విన్, వీకర్ సెక్షన్ డెవల్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సంయుక్తంగా ఈ మేళాను నిర్వహించనున్నాయి. అర్హత గల వారు జాబ్ మేళాకు హాజరుకావచ్చని , వివరాలకు 040-23237810, 23008413, 35934083 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఉర్దూ అకాడమీ కార్యదర్శి డాక్టర్ మహ్మద్ గౌస్ తెలిపారు.

ఉర్దూభాషతో పాటు ఉర్దూ మీడియంలో చదువుకున్నవారికి ఐటీ కంపెనీలు, బ్యాంకింగ్ , ఫైనాన్స్ , జర్నలిజం, హాస్పిటల్స్, టెలికమ్యూనికేషన్స్ తదితర రంగాల్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ , ఇంజనీరింగ్, సాఫ్ట్ వేర్ తదితర ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.