సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన చీఫ్ విప్ దాస్యం

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన చీఫ్ విప్ దాస్యంహనుమకొండ జిల్లా : అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వరంగల్ పశ్చిమ నియెజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 7గురు లబ్ధిదారులకు రూ.8 లక్షల విలువ చేసే చెక్కులను మంజూరు చేయించి నేడు వడ్డేపల్లిలో అందించారు.