ఏపీలో పలువురు ఐఏఎస్​ల బదిలీ

ఏపీలో పలువురు ఐఏఎస్​ల బదిలీఅమరావతి : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్​లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్​ కొత్త సీఎస్​గా ఆదిత్యనాథ్​దాస్​ నియమించింది. అలాగే పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి,ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఓఎస్డీ గా శ్యామలరావు,సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా,ఎ స్సీ కార్పొరేషన్ ఎండీగా ను సునీత కు పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆదిత్యనాధ్ దాస్ రిలీవ్ అయిన తర్వాత ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా శ్యామలరావు బాధ్యతలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.