చిరుతల అభివృద్ధిపై..మోదీ హర్షం

చిరుతల అభివృద్ధిపై..మోదీ హర్షంహైదరాబాద్ : భారత్ లో చిరుతపులుల సంఖ్య పెరుగుతుండటం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇదో గొప్ప వార్త అని ఆయన అన్నారు. దేశంలో 2014 లో కేవలం 7910 మాత్రమే చిరుత పులులు ఉండగా ప్రస్తుతం చిరుత పులుల సంఖ్య 12, 852కు చేరినట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ వార్త పట్ల ప్రధాని మోదీ తన ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. గ్రేట్ న్యూస్ , సింహాలు, పులుల తర్వాత చిరుతల సంఖ్య పెరిగినట్లు ఆయన చెప్పారు. జంతువుల సంరక్షణ కోసం పాటుపడుతున్న ప్రతీ ఒక్కరికీ ఆయన కంగ్రాట్స్ చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలనే ఎప్పటికీ కొనసాగించాలని, సురక్షితమైన ప్రదేశాల్లో జంతువులు ఉండేలా చూడాలని కోరారు. 2014తో పోల్చుకుంటే ఇప్పుడు చిరుతల సంఖ్య 60 శాతం కన్నా ఎక్కువ జనాభా రికార్డు అయ్యింది. మధ్యప్రదేశ్ , కర్నాటక, మహారాష్ట్రల్లో చిరుతల సంఖ్య ఎక్కువగా వుంది.