కోవిడ్ బారిన రకుల్ ప్రీత్ సింగ్

కోవిడ్ బారిన రకుల్ ప్రీత్ సింగ్

హైదరాబాద్ : టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది. తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిందని ఇన్ స్టాగ్రామక్ పోస్టు ద్వారా తెలిపింది. కోవిడ్ 19 పాజిటివ్ గా తేలిందని ప్రతీ ఒక్కరికీ తెలియచేస్తున్నా.సెల్ఫ్ క్వారంటైన్ అయ్యాను. నేను క్షేమంగానే వున్నాను. నేను త్వరలో షూటింగ్ లో జాయిన్ కావాల్సి ఉండగా, ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరముంది. అంటూ పోస్టులో పేర్కొంది.కోవిడ్ బారిన రకుల్ ప్రీత్ సింగ్తనతో కాంటాక్టులోకి వచ్చిన వారు, సన్నిహితంగా మెదిలిన వారు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని రకుల్ విజ్ఞప్తి చేసింది. అందరికీ ధన్యవాదాలు తెలిపి, సురక్షితంగా ఉండాలని ఆమె కోరింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అర్జున్ కపూర్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న ప్రాజెక్టుతో బిజీగా వుంది. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవులు వెకేషన్ టూర్ లో సరదాగా ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే.