ఈనెల 7న ఎమ్మెల్యేగా సీఎం మమతా బెనర్జీ ప్రమాణం

ఈనెల 7న ఎమ్మెల్యేగా సీఎం మమతా బెనర్జీ ప్రమాణం

వరంగల్ టైమ్స్, కోల్ కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈనెల 7న ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రమాణం చేయనున్నారు. సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని గవర్నర్ ను తాము అభ్యర్థించినట్లు ఈ రాష్ట్రమంత్రి పార్థ ఛటర్జీ తెలిపారు.ఈనెల 7న ఎమ్మెల్యేగా సీఎం మమతా బెనర్జీ ప్రమాణంబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత, టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించడంతో మమతా బెనర్జీ మూడోసారి సీఎం పదవి చేపట్టారు. కాగా, మమత సీఎంగా కొనసాగాలంటే ఉపఎన్నికలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొన్నది.

ఈనేపథ్యంలో భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె 58,835 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని సాధించారు. మమతకు 85,263 ఓట్లు రాగా, ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్ కు 26,428 ఓట్లు పడ్డాయి. ఉపఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. జంగీపూర్ లో టీఎంసీ అభ్యర్థి జాకీర్ హుస్సేన్ 92,480 ఓట్ల మెజార్టీతో, షంషేర్ గంజ్ లో అమీరుల్ ఇస్లామ్ 26,379 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.