ఈనెల 11 వరకు ఆర్యన్ కు కస్టడీ విధించిన ఎన్సీబీ

ఈనెల 11 వరకు ఆర్యన్ కు కస్టడీ విధించిన ఎన్సీబీముంబై : డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరింత చిక్కుల్లో పడ్డాడు. ముంబై కోర్టు అతనికి సోమవారం వరకూ ఎన్సీబీ కస్టడీ విధించగా, ఈనెల 11 వరకూ దానిని పొడిగించాలని ఎన్సీబీ కోర్టును కోరింది. ఆర్యన్ ఖాన్ ఫోన్ లో ఫోటోల రూపంలో ఈ నేరానికి సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు కోర్టుకు వివరించింది.

అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణాతో ఈ కేసుకు లింకు ఉందని ఈ ఫోటోల ద్వారా తేలిందని ఈ సందర్భంగా ఎన్సీబీ వాదించింది. డ్రగ్స్ ను భారీగా సేకరించి పంపిణీ చేసే పనిలో ఉన్నట్లు కూడా కోర్టుకు చెప్పింది. తాము జరిపిన దాడుల్లో సప్లయర్ దగ్గరి నుంచి భారీ మొత్తాల్లో డ్రగ్స్ పట్టుబడినట్లు తెలిపింది.