రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
వరంగల్ టైమ్స్, గుజరాత్ : గుజరాత్ తీరంలో అక్రమంగా భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ బోటును ఇండియన్ కోస్టు గార్డుకు చెందిన పోలీసులు పట్టుకున్నారు. గుజరాత్ ఏటీఆఎస్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ అరెస్ట్ జరిగింది.
పది మందితో ఉన్న పాక్ బోటును గుజరాత్ తీరంలో పట్టుకున్నారు. ఈ బోటులో ఆయుధాలను సరఫరా చేస్తున్నారు. ఇంకా సుమారు 40 కేజీల బరువు ఉన్న మాదకద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ నార్కోటిక్స్ విలువ మార్కెట్ లో సుమారు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.