తిరుపతిలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పర్యటన

తిరుపతిలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పర్యటన

తిరుపతిలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పర్యటనవరంగల్ టైమ్స్, తిరుపతి జిల్లా : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై చంద్రచూడ్ నేటి నుంచి రెండ్రోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ఉదయం 9:45 గం. కు ఢిల్లీ నుండి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1.35 గం. కు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. రోడ్డు మార్గాన తిరుమల చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని, రాత్రి అక్కడే బస చేసి, గురువారం సాయంత్రం 5.40 కు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి విజయవాడకు వెళ్ళనున్నారు.