8.78 లక్షల నీట్‌ ర్యాంకుకూ ఎంబీబీఎస్‌ సీటు ! 

8.78 లక్షల నీట్‌ ర్యాంకుకూ ఎంబీబీఎస్‌ సీటు !

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : జహీరాబాద్ లో రూ. 97 కోట్లతో నిర్మిస్తున్న అభివృద్ధి పనుల పైలాన్ ని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు భారీగా పెరిగాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. వైద్య సీట్లలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి చేరిందని అన్నారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లకు కటాఫ్ మార్కులు తగ్గాయని పేర్కొన్నారు. 8.78 లక్షల నీట్ ర్యాంకుకు రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అన్నారు.8.78 లక్షల నీట్‌ ర్యాంకుకూ ఎంబీబీఎస్‌ సీటు ! తెలంగాణలో కొత్తగా 8 వైద్య కాలేజీలతో మరో 1,150 సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు హరీశ్ రావు తెలిపారు. బి-కేటగిరీలో 80 శాతం స్థానిక రిజర్వేషన్లతో ప్రయోజనం ఉంటుందని, రిజర్వేషన్లు పెరగడంతో ఎస్టీ విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయని అన్నారు. జనాభా ప్రాతిపదికన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణకు తొలిస్థానం , వైద్యవిద్య పీజీ సీట్లలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు వివరించారు.