జూలై 17న నీట్..దరఖాస్తులు ప్రారంభం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ (NEET)పరీక్ష షెడ్యూల్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( ఎన్టీఏ ) విడుదల చేసింది. ప్రవేశ పరీక్షను జూలై 17న నిర్వహించనుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మే 6 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది.ఈ పరీక్షను దేశ వ్యాప్తంగా 543 నగరాల్లో, 13 భాషల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. తెలుగులో కూడా నీట్ పరీక్షను నిర్వహించనుంది. ఇప్పటి వరకు ఉన్న వయో పరిమితిని ఎత్తివేసింది. గతంలో 25 యేండ్ల లోపువారే నీట్ పరీక్ష రాసేందుకు అర్హులుగా ఉండేవారు. కాగా ఓపెన్ స్కూల్ లో, ప్రైవేట్ గా ఇంటర్ సెకండ్ ఇయర్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది.దరఖాస్తు ఫీజు : రూ. 1600, ఈ డబ్ల్యూఎస్, ఓబీసీ విద్యార్థులకు రూ. 1500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, థర్డ్ జండర్లకు రూ. 900, ఎన్ఐఆర్ అభ్యర్థులకు రూ. 8500
దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ లో
దరఖాస్తులకు చివరి తేదీ : మే 6
వెబ్ సైట్ : neet.nic.in