ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ సేవలకు బ్రేక్

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ సేవలకు బ్రేక్

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వివియోగించే ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ అయిన వాట్సాప్, ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ నిలిచిపోయాయి. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సేవలకు అంతరాయం కల్గింది. ఒక్కసారిగా యాప్ లు పని చేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే యాప్ లు పని చేయకపోవడానికి కారణాలు తెలియరాలేదు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని ఫేస్ బుక్ పేర్కొంది. అదే పనిలో ఉన్నామని, సేవల్లో అంతరాయానికి చింతిస్తున్నట్లు ఫేస్ బుక్ వెబ్ సైట్ లో పోస్టు పెట్టింది.ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ సేవలకు బ్రేక్భారత్ లో రాత్రి 9 గంటల నుంచి సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు పలువురు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ట్రాకింగ్ వెబ్ సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం ఇప్పటి వరకు 30 వేలకు పైగా జనం వాట్సాప్ సమస్య గురించి తెలిపారు. ఇన్ స్టాగ్రామ్ పై 18,970 మంది, ఫేస్ బుక్ పై 6900 మందికి పైగా సమస్య గురించి పేర్కొన్నారు.