రేటింగ్స్ కోసం ఇంత నీచానికి దిగజారుతారా!

రేటింగ్స్ కోసం ఇంత నీచానికి దిగజారుతారా!

రేటింగ్స్ కోసం ఇంత నీచానికి దిగజారుతారా!పెళ్లి రూమర్స్ పై సాయిపల్లవి ఘాటు విమర్శలు
నెటిజన్లపై ఫైర్ అయిన సాయిపల్లవి

వరంగల్ టైమ్స్,హైదరాబాద్: తన పెళ్లిపై వచ్చిన రూమర్స్ పై హీరోయిన్ సాయిపల్లవి స్పందించింది.సాయిపల్లవికి తమిళ దర్శకుడికి వివాహం అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.అయితే ఈ ఘటనపై తాజాగా సాయిపల్లవి సోషల్ మీడియా వేదికగా ఘాటుగానే స్పందించింది.”తాను రూమర్ లను పెద్దగా పట్టించుకోబోనని, కానీ అవి కుటుంబం లాంటి తన స్నేహితుల గురించి అయినప్పుడు తాను మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు. తన సినిమా పూజలో దిగిన ఒక ఫోటోని క్రాప్ చేసి దానిని దురుద్దేశంతో పెయిడ్ అకౌంట్స్ ప్రచారం చేస్తున్నాయి. తన పనికి సంబంధించి మంచి విషయాలు మాత్రమే ప్రేక్షకులతో పంచుకున్నప్పుడు ఇలాంటి పనికి మాలిన వేషాలు చూసి బాధ కల్గుందన్నారు. ఇలా ఇబ్బంది కల్గించడం చాలా విచారకరం” అంటూ సాయి పల్లవి సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.ఇక ఈ పోస్టుపై నెటిజెన్లు స్పందిస్తూ,ఇటువంటి ఫేక్ న్యూస్ ను ట్రెండ్ చేసేవాళ్ల పని పట్టాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తమిళ హీరో శివ కార్తికేయన్ తో కలిసి సాయి పల్లవి ‘SK21’అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో చిత్రబృందంతో పాటు సాయిపల్లవి, దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి కూడా మెడలో దండలు వేసుకుని ఫోటోలు దిగారు. అయితే ఈ ఫోటోను కొందరు నెటిజన్లు సగం వరకు క్రాప్ చేసి సాయిపల్లవి పెళ్లి అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ సృష్టించారు. దీంతో ఓవర్ నైట్ లో ఈ విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. అయితే ఈ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని తర్వాత మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.