బీఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న!

బీఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న!

బీఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న!వరంగల్ టైమ్స్,హైదరాబాద్: ప్రజా గాయకుడు, వైఎస్సార్టీపీ నేత ఏపూరి సోమన్న ఆ పార్టీని వీడనున్నారు. వైఎస్సార్టీపీ తుంగతుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న ఏపూరి సోమన్న త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో బీఆర్ఎస్ లో చేరనున్న ఏపూరి సోమన్న నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. మంత్రి కేటీఆర్ ని కలిసిన వారిలో ఏపూరి సోమన్నతో పాటు టీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, తదితరులు ఉన్నారు.