వరంగల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా డే

వరంగల్ అర్బన్ జిల్లా: ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో ఘనంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని బీజేపి కార్యాలయంలో యోగ గురువు శ్రీనివాస్ , బీజేపీ నాయకులతో యోగాసనాలు చేయించారు.వరంగల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా డేయోగా కార్యక్రమం ముగిసిన అనంతరం రావు పద్మఅమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు యోగా గురువు శ్రీనివాస్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు అమరేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా నాయకులు కొలను సంతోష్ రెడ్డి, సంగని జగదీశ్వర్, కందగట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.