కామ్రేడ్ మల్లు స్వరాజ్యం కన్నుమూత

కామ్రేడ్ మల్లు స్వరాజ్యం కన్నుమూత

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు వీరనారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేమ్ మల్లు స్వరాజ్యం( 91 ) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కామ్రేడ్ మల్లు స్వరాజ్యం కన్నుమూతమల్లు స్వరాజ్యం మృతిపట్ల సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ కామ్రేడ్స్, ప్రజాప్రతినిధులు పలువురు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతాయని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.