మద్యం మత్తులో ఎస్ఐ వీరంగం

మద్యం మత్తులో ఎస్ఐ వీరంగం

స్నేహితులతో కలిసి బ్లూకోర్ట్ సిబ్బందిపై దాడి

వరంగల్ టైమ్స్, క్రైం డెస్క్ : పూల్ గా మద్యం సేవించి వీరంగం సృష్టించాడు ఓ ఎస్ఐ. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నానన్న విషయాన్ని మరచి తన స్నేహితులతో కలిసి బ్లూ కోర్ట్​ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు వచ్చి అడ్డుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.

మద్యం మత్తులో ఎస్ఐ వీరంగంమంచిర్యాలలో కరీంనగర్‌ జిల్లా బెజ్జంకి ఎస్ఐ తిరుపతి వీరంగం సృష్టించారు. తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి మద్యం సేవించిన ఎస్ఐ తిరుపతి హల్​చల్ సృష్టించారు. ఐబీ చౌరస్తా వద్ద స్నేహితులతో కలిసి గొడవ చేస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి వచ్చిన బ్లూకోర్టు సిబ్బంది ఎస్ఐ తిరుపతికి ఇక్కడి నుంచి వెళ్లాలని సూచించారు.

తిరుపతి వినిపించుకోకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో బ్లూ కోర్ట్ సిబ్బందిపై ఎస్ఐ తిరుపతి తన స్నేహితులతో కలిసి దాడి చేశారు. పోలీసులపై దాడిని స్థానికులు అడ్డుకోవడంతో కారు వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. ఎస్ఐ తిరుపతి స్వగ్రామం మంచిర్యాల జిల్లా వేంపల్లి కాగా, బెజ్జంకిలో విధులు నిర్వర్తిస్తున్నారు.