ఎంసెట్-2023 ఫలితాల్లో షైన్ విజయకేతనం

ఎంసెట్-2023 ఫలితాల్లో షైన్ విజయకేతనం

రాష్ట్ర స్థాయిలో మెడికల్ కేటగిరీలో 1865 ర్యాంకు
ఇంజినీరింగ్ కేటగిరీలో 2825 ర్యాంకు
టెన్త్ , ఇంటర్ లోనూ ఇదే హవా
జేఈఈ, నీట్ లోనూ మెరుగైన ర్యాంకులుఎంసెట్-2023 ఫలితాల్లో షైన్ విజయకేతనంవరంగల్ టైమ్స్,హనుమకొండ జిల్లా: ఎంసెట్-2023 ఎంట్రన్స్ ఫలితాల్లో షైన్ విద్యాసంస్థల విద్యార్థులు సత్తా చాటారు.షైన్ స్కూల్స్ తో ప్రైమరీ, సెకండరీ విద్యాసంస్థల్లో మెరుగైన విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్న షైన్ విద్యాసంస్థలు జూనియర్ కాలేజీలను స్థాపించిన అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాయి. అందులో భాగంగానే జూనియర్ కాలేజీలను స్థాపించిన అనతి కాలంలోనే ఇంటర్ ఫలితాలతో పాటు , ఎంసెట్ , జేఈఈ, నీట్ పరీక్షల్లో ఎన్నో ర్యాంకులు సాధిస్తూ, రాష్ట్ర స్థాయిలో కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ముందుకు సాగుతోంది షైన్ విద్యాసంస్థలు.

రాష్ట్ర స్థాయిలో 1865 ర్యాంకు సాధించి కార్పొరేట్ విద్యాసంస్థలకు సమానంగా ఫలితాలు అందచేయడం జరిగిందని షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు పి. రాజేంద్రకుమార్, మూగల రమ మరియు మూగల రమేష్ లు సంయుక్తంగా తెలిపారు.గురువారం విడుదల చేసిన ఎంసెట్-2023 ఎంట్రన్స్ ఫలితాలలో షూన్ జూనియర్ కాలేజీ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు.షైన్ విద్యాసంస్థలు మొదటి నుంచి జేఈఈ మెయిన్స్, నీట్ మరియు ఎంసెట్ ఎంట్రన్స్ లలో అత్యుత్తమైనటువంటి శిక్షణను వరంగల్ లో అందించడం జరుగుతుందని వారు తెలిపారు.

చక్కటి అకాడమిక్ ప్రోగ్రామింగ్ మరియు ప్రణాళికల ద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు సైతం అద్భుతమైన ఆణిముత్యాలుగా తీర్చిదిద్దబడి, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారని తెలిపారు. ఎంసెట్-2023 ఫలితాల్లో మెడికల్ కేటగిరీలో ఆరే శ్రీవర్షిని (2311W06159) 1865 ర్యాంకు, డి.శ్రీజ(2311W08136) 9503వ ర్యాంకు, ఇంజినీరింగ్ కేటరిగీలో ఉగ్గె శ్వేత(2326P02140)2825 ర్యాంకు, టి.నిహారిక(2323W07122) 5185 ర్యాంకులు సాధించారు. వీరిని షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్ తో పాటు అధ్యాపకులు అభినందించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నిరంతర పర్యవేక్షణ మరియు మోటివేషన్ తో మామూలు విద్యార్థులను కూడా మెలకువలు కలిగిన విద్యార్థులకుగా తీర్చదిద్దడం జరుగుతుందని అన్నారు.

ప్రతీ విద్యార్థిపైన వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం వల్లనే ఈ విజయాలు సాధించడానికి సాధ్యపడుతుందని చైర్మన్ మూగల కుమార్ యాదవ్ తెలిపారు. ఈ విజయాలకు సహకరించిన కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షైన్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్స్ మారబోయిన రాజు గౌడ్, కొత్తకొండ శ్రీనివాస్, అధ్యాపకులు మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.