వ్యాక్సిన్​ తీసుకున్న జో బైడెన్​

వ్యాక్సిన్​ తీసుకున్న జో బైడెన్​న్యూయార్క్​ : అమెరికా కొత్త అధ్యక్షుడు జోబైడెన్​ కొవిడ్​ వ్యాక్సిన్​ను తీసుకున్నారు. డెలావర్​లోని క్రిస్టియానా ఆస్పత్రిలో 78 సంవత్సరాల వయస్సు గల బైడెన్​కు ఫైజర్​ టీకా ఇచ్చారు. ఈ వ్యాక్సినేషన్​ ప్రోగ్రాన్ని అమెరికా చానళ్లు లైవ్​ ప్రసారం చేశాయి. అమెరికన్లలో కరోనా టీకా పట్ల ఉన్న భయాలను తొలగించేందుకే బహిరంగంగా వ్యాక్సిన్​ తీసుకున్నటులు బైడెన్​ తెలిపారు. టీకా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వచ్చే సంవత్సరం నుంచి యూఎస్​లో టీకా పంపిణీకి సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఈక్రమంలోనే వ్యాక్సిన్​పై ఉన్న ఆపోహాలను తొలగించేందుకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను వ్యాక్సిన్​ను బహిరంగంగా తీసుకుంటానని వెల్లడించారు. ఇందులో భాగంగానే బైడెన్​ సోమవారం టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు అమెరికాలో 17.5 మిలియన్లకు పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. 3.15 లక్షల మంది మృతిచెందిన విషయం తెలిసిందే.