విదేశీ కరెన్సీ పట్టివేత

విదేశీ కరెన్సీ పట్టివేతశంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ. 33 లక్షల విలువైన విదేశీ కరెన్సీని సీఐఎస్‌ఎఫ్‌(సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి షార్జాకు జీ9459 విమానంలో వెళ్తున్న ఓ ప్రయాణికుడిని సీఐఎస్‌ఎఫ్‌ తనిఖీ నిర్వహించింది. ఈ తనిఖీలో నిందితుని వద్ద యూఎస్‌ డాలర్లు, ఒమన్‌, సౌదీ, ఖతర్‌ రియాల్స్‌ పట్టుబడ్డాయి. వాటిని విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. పట్టుబడిన కరెన్సీ విలువ రూ. 33,53,274 ఉంటుందని తెలిపారు. నిందితుడిని కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు.