బంగారు పతకం సాధించిన వరంగల్ బాలుడు

బంగారు పతకం సాధించిన వరంగల్ బాలుడు

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: న్యూ డ్రాగన్ ఫైటర్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ పీవీ శ్రీరాములు ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్ నగర్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2022 కుంగ్ ఫు కరాటే పోటీలు నిర్వహించారు. 12 సంవత్సరాల లోపు బాలుర కమిటి( ఫైట్) విభాగంలో వరంగల్ కొత్త వాడ గోల్డెన్ కిడ్స్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఎండీ ఇర్ఫాన్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడు.

ఈ పోటీలో సుమారు పది దేశాలు బంగ్లాదేశ్, నేపాల్, వియత్నం, సౌదీ అరేబియా, శ్రీలంక, కతర్, ఇరాక్ దేశాల నుండి సుమారు 4 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బంగారు పతకం సాధించిన ఇర్ఫాన్ కు పాఠశాల కరస్పాండెంట్ సుజాత, ప్రిన్సిపాల్ మాధవి, ఉపాధ్యాయులు స్వప్న రమాదేవి, రాణి, లావణ్య,హేమలత, అజంత, భవాని శ్యామ్, నరేష్, సతీష్ లు ఘనంగా సన్మానించారు. సన్మానం అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు ఎండీ ఇర్ఫాన్ కు అభినందనలు తెలిపారు.