ఆమెకు 14 రోజుల రిమాండ్ ఎందుకు తెలుసా..?

ఆమెకు 14 రోజుల రిమాండ్ ఎందుకు తెలుసా..?వరంగల్ టైమ్స్, విజయవాడ: విజయవాడలోని 5వ నంబ‌రు రూటులో ఇటీవ‌ల బస్సు డ్రైవర్‌పై చేయి చేసుకున్న మహిళకు 14 రోజుల రిమాండ్ విధించింది. రోడ్డుమీద బైక్ పై వెళ్తున్న తనను బస్ తో గుద్దేశాడన్న కోపాన్ని ఓ మహిళ కంట్రోల్ చేసుకోలేకపోయింది. కిందపడి గాయపడ్డ ఆ మహిళ ఆ తర్వాత బస్సులోకి వచ్చి డ్రైవర్ ను కాలితో తన్ని నానా హంగామా చేసింది. తోటి ప్రయాణికులు వారించినా డ్రైవర్ సర్ట్ చింపి మరీ అతడిపై దాడికి దిగింది. ఫిబ్రవరి 10న సూర్యారావు పేట వద్ద జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ పై చేయి చేసుకున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పీఎస్ కు తరలించిన విషయం తెలిసిందే.