దివ్యాంగులకు ట్రైసైకిల్స్ అందించిన ఎమ్మెల్సీ కవిత

దివ్యాంగులకు ట్రైసైకిల్స్ అందించిన ఎమ్మెల్సీ కవితవరంగల్ టైమ్స్,హైదరాబాద్: దివ్యాంగుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో పలువురు దివ్యాంగులకు ట్రై సైకిల్ ఎలక్ట్రిక్ వాహనాలను ఎమ్మెల్సీ కవిత అందజేశారు. ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకు రూ.500 ఉన్న దివ్యాంగుల పెన్షన్ ను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యాక సీఎం కేసీఆర్ రూ.3,016పెంచారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దీంతోపాటు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ దివ్యాంగుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని ఆమె పేర్కొన్నారు.