దివ్యాంగులకు పండ్లు అందించిన టీఆర్ఎస్వీ

దివ్యాంగులకు పండ్లు అందించిన టీఆర్ఎస్వీ

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: సీఎం కేసీఆర్ బర్త్ డేను పురస్కరించుకుని టీఆర్ఎస్వీ హన్మకొండ జిల్లా కో-ఆర్డినెటర్ డా.అరూరి రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. నగరంలోని దివ్యాంగుల అతిథి ఆశ్రమంలో డా.అరూరి రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండ్లు, బిస్కెట్ల పంపిణీ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్ చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని దివ్యాంగులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఎన్నో యేళ్లుగా కోల్పోయిన హక్కులను 8యేళ్ల కాలంలో సాధించి సీఎం కేసీఆర్ చరిత్రకెక్కారని మాచర్ల శరత్ అన్నారు.

తెలంగాణలో సుపరిపాలన చేస్తున్న ఉద్యమనేత, సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. సీఎం కేసీఆర్ సేవలు తెలంగాణకే పరిమితం కాకుండా భారత దేశంలోనూ ఆయన నాయకత్వం తీసుకురావాలని టీఆర్ఎస్వీ నాయకులు శరత్ చంద్ర, డా. అరూరి రంజిత్ కుమార్ లు ఆకాంక్షించారు. అనంతరం సీఎం కేసీఆర్ కు బర్త్ డే విషెష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ లంక రాజగోపాల్, మహేష్, రాకేష్ , సదీప్, లోహిత్ తదితరులు పాల్గొన్నారు.