వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. తమ కొడుకు, కూతురికి ఎత్తు బంగారాన్ని సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జాతర ప్రాంగణంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన అన్నారు. ప్రశాంతంగా భక్తులు వనదేవతలను దర్శించుకోవాలని చీఫ్ విప్ కోరారు.
Home United Warangal
Latest Updates
