భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జిల్లాను మావోయిస్టు రహిత జిల్లాగా రూపొందించేందుకు కృషి చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన ఫైర్ రేంజ్, పరేడ్ గ్రౌండ్, బీఓఏసీని డీజీపీ ప్రారంభించారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి మావోయిస్టులు జిల్లాకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా లోని యువత కు పోలీసు శాఖలో ఉద్యోగాలకు శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పోలీసు హెడ్ క్వార్టర్ లో ఫైర్ రేంజ్, పరేడ్ గ్రౌండ్, బీఓఏసీని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈసందర్భంగా డీజీపీ జిల్లా యంత్రాంగ పనితీరును అభినందించారు.