‘జీఎస్టీ’టీజర్​ లాంచ్

‘జీఎస్టీ’టీజర్​ లాంచ్హైదరాబాద్​ : “తోలుబొమ్మల సిత్రాలు” బ్యానర్ పై కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం G S T (God Saitham Technology)ఈ చిత్రం టీజర్ ని ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి లాంచ్ చేశారు. ‘తోలుబొమ్మల సిత్రాలు” బ్యానర్ పై నిర్మిస్తున్న జీఎస్టీ చిత్రాన్ని నా శిష్యుడు జానకిరామ్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాడు. టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రేక్షకులను కోరుతున్నాను. జానకిరామ్ మంచి దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ కి అభినందనలు ” అన్నారు రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి.‘మా చిత్రం టీజర్ ని లాంచ్ చేసిన మా గురువు పోసాని కృష్ణమురళికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు దర్శకుడు జానకిరామ్. ఈ చిత్రంలో హీరోలు  ఆనంద్ కృష్ణ, అశోక్, హీరోయిన్లు : స్వాతి మండల్, యాంకర్ ఇందు, పూజ సుహాసిని, కామెడీ పాత్రలో జూనియర్ సంపూ, ఇతర తారాగణం : వెంకట్, నందు, వాణి, స్వప్న, “వేదం”నాగయ్య, గోవింద్, నల్లి సుదర్శనరావు, “జానపదం”అశోక్, రాథోడ్ మాస్టర్, సూర్య, సంతోష్, రమణ.
ఎడిటింగ్ : సునీల్ మహారాణ
డీవోపీ డీ యాదగిరి
సంగీతం : యు వీ నిరంజన్
నిర్మాత : కొమారి జానయ్య నాయుడు
కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం : కొమారి జానకిరామ్
పీఆర్వో : మధు. వీ ఆర్