నిరసనకు దిగిన శ్రీవారి భక్తులు

నిరసనకు దిగిన శ్రీవారి భక్తులు

వరంగల్ టైమ్స్, తిరుపతి : తిరుపతి గరుడ కూడలిలో భక్తులు ఆందోళనకు దిగారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని కోరుతూ వారు ఆందోళన చేశారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గరుడ కూడలిలో బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సారి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న టీటీడీ ఈనెల 24 వరకు సర్వదర్శన టోకెన్లు జారీ చేసింది. నిరసనకు దిగిన శ్రీవారి భక్తులుఅయితే మూడు రోజుల ముందుగానే టోకెన్లు ఇచ్చే కేంద్రాలను మూసివేసింది. దీంతో ముందస్తు ప్రకటన లేకుండా సర్వదర్శన టోకెన్లను జారీ చేయడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. శ్రీవారి మాల వేసుకుని పాదయాత్రగగా దూరప్రాంతాల నుంచి వచ్చిన తమకు శ్రీవారిని దర్శించుకోకుండా వెనుదిరగాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి జోక్యం చేసుకుని సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని భక్తులు డిమాండ్ చేశారు.