డిసెంబర్ 31న డీజీపీ మహెందర్ రెడ్డి రిటైర్మెంట్

డిసెంబర్ 31న డీజీపీ మహెందర్ రెడ్డి రిటైర్మెంట్

డిసెంబర్ 31న డీజీపీ మహెందర్ రెడ్డి రిటైర్మెంట్వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ డిజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 31తో ముగియనుంది. రాజాబహదూర్ వెంకటరాం రెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో రేపు పదవీ విరమణ ఉత్సవ పరేడ్ జరుగనుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ పోలీస్ అధికారులు, వీఐపీలు పాల్గొననున్నారు. 1986 బ్యాచ్ కు చెందిన మహేందర్ రెడ్డి 36 సంవత్సరాల పాటు ఐపీఎస్ అధికారిగా సుధీర్గ సేవలు అందించారు.

మహేందర్ రెడ్డి తెలంగాణ పోలీస్ బాస్ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సహా పలు కీలక పదవులు చేపట్టారు. మావోయిజం నియంత్రణలో మహెందర్ రెడ్డిది విశేష కృషి. సాంకేతికత విషయంలో పోలీస్ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇక తెలంగాణ నూతన డీజీపీగా రేపు అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.