తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 95,355 నమూనాలను పరీక్షించగా 3,590 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,58,566కి పెరిగింది. తాజాగా మహమ్మారి బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 3,555 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 7,14,034 మంది కరోనా నుంచి బయటపడినట్లు ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. మరో 40,447 మంది చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 94.13 శాతంగా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 1160 మందికి పాజిటివ్‌గా తేలింది.

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి