ఓల్డ్​మలక్​పేటలో కొనసాగుతున్న రీపోలింగ్​

ఓల్డ్​మలక్​పేటలో కొనసాగుతున్న రీపోలింగ్​
హైదరాబాద్​: గుర్తుల తారుమారుతో నిలిచిపోయిన ఓల్డ్​ మలక్​పేట రీ పోలింగ్​ గురువారం ప్రారంభమై కొనసాగుతుంది. డివిజన్‌లో ఆరుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 54,655 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 27,889 మంది పురుషులు, 26,763 మంది మహిళా ఓటర్లు, ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నారు. డివిజన్‌ పరిధిలో మొత్తం 69 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రీపోలింగ్‌ కోసం 12 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు అధికారులు తెలిపారు. 23 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ను పరిశీలిస్తామన్నారు. రీపోలింగ్​ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా షటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే డివిజిన్​ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్​ కార్యాలయాలకు , విద్య, వ్యాపార సముదాయాలకు సెలవు ప్రకటించారు.