క్లాస్‌రూమ్‌లో ఇంటర్ స్టూడెంట్స్ పని.. వైరల్

రాజమండ్రి: క్లాస్‌రూమ్‌లో ఇంటర్ స్టూడెంట్స్  చేసిన పని తెలియడంతో కాలేజీ ప్రిన్సిపల్ ఇద్దరికీ టీసీలు ఇచ్చి పంపించారు. అంతటితో ఈ వివాదం ముగిసిపోయిందిని అందరూ భావించారు. కానీ, వైరల్ కావడంతో ఆలస్యంగా ఘటన బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జూనియర్ కాలేజీలో ఇంటర్ అమ్మాయి-అబ్బాయి పెళ్లి వ్యవహారం కలకలంరేపింది. నగరంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఆమె నుదిటిన బొట్టు పెట్టాడు. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో వీడియో కూడా రికార్డ్ చేశారు. ఆ పక్కనే మరికొందరు విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

క్లాస్‌రూమ్‌లో ఇంటర్ స్టూడెంట్స్ పని.. వైరల్

రాజమండ్రిలో ఘటన
ఈ ఇద్దరు చేసిన పిచ్చి పనితో తల్లిదండ్రులు కూడా అవాక్కయ్యారు. ఇద్దరు విద్యార్థులు మైనర్లు కావడంతో ఈ వ్యవహారం హాట్‌టాపిక్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ పెళ్లి సరాదా కోసం చేసుకున్నారా.. ఉద్దేశపూర్వకంగా చేసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది.