కన్న తండ్రిని హత్య చేసిన కొడుకు

కన్న తండ్రిని హత్య చేసిన కొడుకుఅనంతపురం రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం మామిళ్ళపల్లి గ్రామంలో కన్నకొడుకే కాలయముడైయాడు. తినే అన్నంలో మత్తు మందు కలిపి తండ్రిని అతి కిరాతకంగా కొడవలితో విచక్షణారహితంగా నరికి హత్య చేశాడు. కనగానపల్లి మండలం మామిళ్ళపల్లి గ్రామ శివారులో ఉన్న పోతుల కాలనీలో నివాసముంటున్న నారాయణస్వామి అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. నారాయణస్వామ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చెట్లు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులు భార్యా పిల్లలకు ఇచ్చేవాడు. అయితే ఈ క్రమంలో పెద్ద కొడుకు వేరొక నివాసంలో కాపురం ఉంటున్నాడు. చిన్న కొడుకు గణేష్ కు ఈ మధ్యనే మూడు నెలల క్రితం వివాహం చేశారు. గణేష్ పెళ్లి అయినప్పుడు నుండి ఏ పని పాట లేకుండా తిరుగుతూ ఉండేవాడు అయితే మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుండి మామిళ్ళపల్లి కి వచ్చిన తండ్రి నారాయణ స్వామిని డబ్బులు డిమాండ్ చేశాడు. నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పుకుంటూ వచ్చాడు తండ్రి. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఎలాగైనా సరే తండ్రి నుండి డబ్బులు తీసుకోవాలని గణేష్ భార్య అనిత ఇద్దరు ఆలోచన చేశారు. ఇంట్లో ఉన్న అన్నం లో మత్తు మందు కలిపి ఇద్దరు బయటకి వెళ్ళిపోయారు. ఆ అన్నం తిన్న నారాయణస్వామి మత్తు వచ్చి మంచం మీద పడుకొని ఉండగా రాత్రి 10:30 నిమిషాలకు గణేష్ అనిత ఇద్దరు వచ్చి అక్కడే ఉన్న కొడవలి తీసుకొని విచక్షణారహితంగా తండ్రిని హత్య చేశాడు.