రెండు రోజుల పోలీస్ కస్టడీకి నాగేశ్వరరావు

మచిలీపట్నం: మంత్రి పేర్ని నానిపై దాడి చేసిన నిందితుడు బడుగు నాగేశ్వరరావును కోర్టు అనుమతితో గురువారం మచిలీపట్నం సబ్ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు చిలకలపూడి సీఐ వెంకట నారాయణ తెలిపారు. భారీ బందోబస్తు మధ్య నిందితుడిని తరలించినట్లు చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు టీడీపీ ముఖ్య నేతలను విచారించిన పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను విచారించనున్నారు. ఇసుక లేక అక్కస్సుతో దాడి చేసి ఉండొచ్చంటూ ఘటన జరిగిన తర్వాత మీడియాతో మాట్లాడిన కొల్లు రవీంద్రను ఇదే విషయమై ఏ ఆధారంతో మాట్లాడారనే దానిపై రవీంద్రను విచారించే అవకాశం ఉందని తెలిపారు.