తుది పోరుకు చేరుకున్న పీవీ సింధు

తుది పోరుకు చేరుకున్న పీవీ సింధుస్పోర్ట్స్ డెస్క్ : సయ్యద్ మోదీ ఓపెన్ అంతర్జాతీయ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్ కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రత్యర్థి ఐదో సీడ్ ఎవ్ జినియా కోత్సెకయ ( రష్యా) రిటైర్డ్ హార్ట్ కావడంతో టాప్ సీడ్ సింధు నేరుగా తుది పోరుకు చేరుకుంది. అంతకుముందు సింధు తొలి గేమ్ లో 21-11తో రష్యా ప్లేయర్ పై ఆధిక్యం ప్రదర్శించింది. రెండో గేమ్ లోనూ దూకుడు కనబరిచే సమయంలో ప్రత్యర్థి అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంది. మరో సెమీస్ లో అనుపమ ఉపాధ్యాయపై 19-21, 21 -19, 21 -7 తో గెలిచిన మాళవికా బన్సోద్ తో సింధు ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.

ఇద్దరు ఇండియన్స్ మధ్య టైటిల్ పోరు రసవత్తరంగా సాగనుంది. రెండున్నరేండ్లుగా అందని ద్రాక్షగా ఉన్న అంతర్జాతీయ టైటిల్ ను ఈ టోర్నీతో దక్కించుకోవాలని సింధు చూస్తుండగా, సీనియర్ ప్లేయర్ పై అదృష్టం పరీక్షించుకునేందుకు మాళవిక సై అంటున్నది. పురుషుల డబుల్స్ సెమీస్ లో నెగ్గిన కృష్ణప్రసాద్ కృ విష్ణవర్ధన్ గౌడ్ జోడీ ఫైనల్ కు చేరింది. మరో పోరులో ధ్రువ్ కపిల-అర్జున్ జోడీని ఓడించిన వే చుంగ్ – కై వాన్ తీ ద్వయంతో కృష్ణకృ విష్ణు జంట తుదిపోరులో తలపడనుంది.