స్విస్ ఓపెన్ టైటిల్ విన్నర్ పీవీ సింధు 

స్విస్ ఓపెన్ టైటిల్ విన్నర్ పీవీ సింధు

వరంగల్ టైమ్స్ , స్పోర్ట్స్ డెస్క్ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్విస్ ఓపెన్ టైటిల్ చేజిక్కించుకుంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ -300 టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆదివారం ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21 -16, 21 -8 తో బుసానన్ (థాయ్ లాండ్ ) పై సక్సెస్ సాధించింది. 49 నిమిషాల్లో ముగిసిన ఫైనల్ ఫైట్ లో సింధు పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ వరుస ఆటల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. బుసానన్ తో తలపడ్డ 17 మ్యాచుల్లో సింధుకు ఇది 16వ విక్టరీ కావడం విశేషం.స్విస్ ఓపెన్ టైటిల్ విన్నర్ పీవీ సింధు ఈ సంవంత్సరం ప్రారంభంలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో విజేతగా నిలిచిన సింధుకు తాజా సీజన్ లో ఇది రెండో టైటిల్ , పురుషుల సింగిల్స్ లో మంచి ఆటతీరుతో ఫైనల్ కు చేరిన హెచ్ఎస్ ప్రణయ్ తుది మెట్టుపై తడబడి రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. ఆఖరి పోరులో ప్రణయ్ 12 -21, 18 -21తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ ( ఇండోనేషియా ) చేతిలో ఓటమి పాలయ్యాడు.