25న జిల్లాస్థాయి యోగాసన పోటీలు
వరంగల్ టైమ్స్,హనుమకొండ జిల్లా: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మరియు రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ గుర్తింపు పొందిన వరంగల్, హనుమకొండ జిల్లాల స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ పోటీలు సెప్టెంబర్ 25న నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర యోగాసన అసోసియేషన్ ఆదేశాల మేరకు సోమవారం ఈ పోటీలు నిర్వహించతలపెట్టినట్లు రెండు జిల్లాల అసోసియేషన్స్ అధ్యక్ష, కార్యదర్శులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు హనుమకొండ నగరంలోని గీతాంజలి మహిళా డిగ్రీ కాలేజీలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి గల వారు ఈ క్రింది అర్హతలు కల్గి ఉండాలని రెండు జిల్లాల అసోసియేషన్స్ అధ్యక్ష, కార్యదర్శులు సూచించారు.
* ఈ పోటీలను సబ్ జూనియర్ విభాగంలో- 8సం.ల నుండి 10సం.ల వయస్సు గల బాలబాలికలు, 10సం.ల నుండి 12సం.ల వయస్సు గల బాలబాలికలు, 12సం.ల నుండి 14సం.ల వయస్సు గల బాలికలు.
* జూనియర్స్ విభాగంలో – 14సం.లనుండి 16సం.లు, 16సం.ల నుండి 18సం.ల వయస్సు వరకు గల బాలబాలికలు.
* సీనియర్స్ విభాగంలో – 18సం.ల నుండి 21సం.లు, 21సం.ల నుండి 25సం.లు, 25సం.ల నుండి 30సం.లు ,30సం.ల నుండి 35సం.లు,35సం.ల నుండి 45సం.ల వయస్సు మరియు 45సం.ల పై బడిన స్త్రీ పురుషులకు
* ప్రొఫెషనల్ విభాగంలో అదే మాదిరిగా ఆర్టిస్టిక్ మరియు రిథమిక్ విభాగంలో కూడా పోటీలు నిర్వహించనున్నారు.
ఈ పోటీలలో ఎంపికైన వారు వచ్చే నెల జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు.అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారు జాతీయస్థాయిలో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఆసక్తిగల వారు ఈ నెల 25న ఉదయం తొమ్మిది గంటలకు హాజరు కావలసిందిగా పిలుపునిచ్చారు.
గమనిక : యోగా పోటీలలో పాల్గొను వారు తప్పని సరిగా
* వయస్సు ధ్రువీకరణ పత్రము (ఆధార్ కార్డ్), ఒక వాటర్ బాటిల్ ,యోగా మ్యాట్,యోగా డ్రెస్ వెంట తీసుకుని రావాల్సిందిగా సూచించారు.
* ఈ పోటోల్లో పాల్గొనేవారు ప్రవేశ రుసుము రూ.50 చెల్లించాలి.
* ప్రీ స్కూల్ లేదా యోగ కోచింగ్ సెంటర్ ల నుంచి ప్రతీ గ్రూప్ నుంచి బాలుర విభాగంలో ఇద్దరికి మరియు బాలికల విభాగంలో ఇద్దరికి మాత్రమే పోటీలలో పాల్గొనుటకు అవకాశం కలదని సూచించారు.
ఈ పోటీల్లో పాల్గొనే వారికి యోగా నిర్వహకులు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక ఈ పోటీల్లో పాల్గొనదలచిన వారు ఈ ఫోన్ నంబర్లను సంప్రదించాల్సిందిగా వరంగల్, హనుమకొండ యోగసన అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు.
- సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
వరంగల్ : 9652429371, 8555859650
హన్మకొండ : 9959878440, 9392355556
గీతాంజలి మహిళ డిగ్రీ కాలేజీ: 9346571232