వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : 60వ డివిజన్ వడ్డేపల్లి బ్యాంక్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ రూ.20 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అనంతరం బ్యాంక్ కాలనీలో నెలకొన్న సమస్యలను స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు రాజేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, ఉప అధ్యక్షులు హేమనాథ్, కమిటీ సభ్యులు రామారావు, జుంకిలాల్, భాస్కర్, డివిజన్ అధ్యక్షులు రామరాజు, డివిజన్ నాయకులు అశోక్, రవి, యూత్ నాయకులు శివ, సోషల్ మీడియా అధ్యక్షులు కేశబోయిన విపుల్, ఏ.ఈ శ్రీకాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.
Home United Warangal