రేపు ముచ్చింతల్ కు రానున్న రాష్ట్రపతి

రేపు ముచ్చింతల్ కు రానున్న రాష్ట్రపతి

వరంగల్ టైమ్స్ , రంగారెడ్డి జిల్లా : శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌ ఆదివారం ముచ్చింతల్‌కు రానున్నారు.13న మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో చినజీయర్‌ ఆశ్రమానికి వస్తారు. దాదాపు రెండుగంటల పాటు దివ్యక్షేత్రంలో గడుపుతారు. శ్రీరామానుజాచార్యుల 120 కిలోల (120 ఏళ్లకు గుర్తుగా) స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.ఆ తరువాత రామానుజ భారీ విగ్రహాన్ని సందర్శించి, ఆడిటోరియంలో ప్రసంగిస్తారు.

రాష్ట్రపతి సాయంత్రం హెలికాప్ట్టర్‌లో బయలుదేరి బేగంపేట చేరుకుని, అక్కడ నుంచి రోడ్డుమార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బసచేస్తారు. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారు. కాగా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం దివ్యక్షేత్రానికి రానున్నారు. ప్రవచన మండపంలో ప్రసంగించిన తరువాత వేదపండితుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. 8.30 గంటలకు తిరుగుప్రయాణమవుతారు. కేంద్రమంత్రి నితీష్‌ గడ్కరీ కూడా శనివారం ముచ్చింతల్‌కు రానున్నారు.