వరంగల్ టైమ్స్, యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. ఆదివారం కావడంతో స్వామివారి క్షేత్రానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో నారసింహుని ధర్మదర్శనానికి గంటన్నర సమయం పడుతున్నది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అరగంట సమయం పడుతున్నది. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించేందుకు నిరాకరించారు.
Home News
Latest Updates
