ఐపీఎల్ లో చెన్నైపై కోల్ కతా ఘన విజయం
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : టీ 20 లీగ్ 15వ సీజన్ లో కోల్ కతా బోణీ కొట్టింది. చెన్నైతో జరిగిన ప్రారంభ మ్యాచులో 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. చెన్నై నిర్దేశించిన 132 రన్స్ స్వల్ప లక్ష్యాన్ని 18. 3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అజింక్య రహానే ( 44) టాప్ స్కోరర్ గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో డ్వేన్ డ్రావో మూడు, మిచెల్ శాంట్నర్ ఓ వికెట్ పడగొట్టారు.