రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో వర్షం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోని ప్రభావంతో రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమ నుంచి తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోని ఏర్పడిందని పేర్కొన్నది.దీని ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.